Skip to content Skip to footer

భారత్ లో ” స్టార్ట్ అప్ స్కూల్” ప్రారంభించిన గూగుల్

స్టార్ట్ అప్స్ (అంకుర సంస్థలు) తొలినాళ్లలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతం గా ఎదుర్కొని నిలదొక్కుకునేందుకు అవసరమైన తోడ్పాటు అందించడానికి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో “స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలే లక్ష్యంగా దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం 9 వారాల పాటు ఉంటుంది.
దాదాపు 70,000 పైగా స్టార్టప్‌లతో, భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానం లో నిలిచింది . వీటిలో ఎక్కువ మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కంపెనీలను విజయవంతంగా IPOలు లేదా యునికార్న్ హోదాకు నడిపిస్తున్నందున, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యవస్థాపకుల లో ఆకాంక్షలను రేకెత్తించే దిశగా నూతన కార్యక్రమాన్ని చేపట్టింది గూగుల్.
ఇకపై స్టార్ట్ అప్ అనగానే మనకు బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై మాత్రమే కాదు గుంటూరు, కాకినాడ, తిరుపతి, అమరావతి, భీమవరం, బొబ్బిలి కూడా గుర్తుకు వచ్చే దిశగా గూగుల్ చర్యలు చేపట్టనుంది.
అయితే స్టార్ట్ అప్ ల నిర్వహణ స్ధాపించినంత సులభం కాదు. 90% స్టార్టప్‌లు మొదటి ఐదు సంవత్సరాలలో విఫలమవుతాయి – కర్ణుడి చావుకు వేయి కారణాలన్నుట్లు వీటి ఫెయిల్యూర్ కి కూడా లక్ష కారణాలుంటాయి. అందులో ముఖ్యంగా నాయకత్వ లేమి, సమర్ధవంతమైన విత్త నిర్వహణ లోపించడం, మార్కెట్ అంచనాలలో తప్పిదాలు, డిమాండ్ ని సరిగా అంచనా వేయకపోవడం, విపరీతంగా క్యాష్ బర్న్ చేయడం లాంటివి. సరిగ్గా వీటి పై అవగాహన కల్పించడానికి గూగుల్ 9 రోజుల వర్చ్యువల్ కార్యక్రమానికి పూనుకొంది.
ఇందులో
సంజయ్ గుప్తా – వైస్ ప్రెసిడెంట్, గూగుల్
రాజన్ ఆనందన్ – ఎం.డి -Sequoia India and SEA & సర్జ్
సంజయ్ మెహతా – ఫౌండర్ అండ్ సీఈఓ -100 X V.సి మరియు ఇతర వ్యవస్థాపకులు పాల్గొంటున్నారు.
జులై 7ఉదయం 11.00 లకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమo కోసం ఇక్కడ చూడండి.

https://startupsonair.withgoogle.com/events/googlestartupschoolindia

Leave a comment